గ్రామీణ ఆరోగ్య వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న ఆశా కార్యకర్తలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం చిట్వేల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శివకు వినతిపత్రం సమర్పించారు.
ఆశా కార్యకర్తల గౌరవ వేతనాన్ని రూ.26 వేలకు పెంచడంతో పాటు ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవ్, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు అమలు చేయాలని కోరారు. రిటైర్మెంట్ అనంతరం రూ.5 లక్షల బెనిఫిట్, రూ.10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ విధుల్లో ప్రాణాలు కోల్పోయిన ఆశా కార్యకర్తల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించి, కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
ఎన్‌హెచ్‌ఎం నిబంధనల ప్రకారం జనాభాకు అనుగుణంగా ఆశాలను నియమించి, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని ఏఐటీయూసీ కార్యదర్శి మాదరాజు గంగాధర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు తిప్పన ప్రసాద్‌తో పాటు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆశా సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ వినతిపత్రం
గ్రామీణ ఆరోగ్య వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న ఆశా కార్యకర్తలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం చిట్వేల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శివకు వినతిపత్రం సమర్పించారు. ఆశా కార్యకర్తల గౌరవ వేతనాన్ని రూ.26 వేలకు పెంచడంతో పాటు ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవ్, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు అమలు చేయాలని కోరారు. రిటైర్మెంట్ అనంతరం రూ.5 లక్షల బెనిఫిట్, రూ.10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ విధుల్లో ప్రాణాలు కోల్పోయిన ఆశా కార్యకర్తల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించి, కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్‌హెచ్‌ఎం నిబంధనల ప్రకారం జనాభాకు అనుగుణంగా ఆశాలను నియమించి, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని ఏఐటీయూసీ కార్యదర్శి మాదరాజు గంగాధర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు తిప్పన ప్రసాద్‌తో పాటు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

