ఎస్ పి ఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 18 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం చెర్లోపల్లి, బండేపల్లిలో పూర్తయిన ఆర్డీఎస్ఎస్ విద్యుత్ పనులతో పాటు సిమెంట్ రోడ్డును సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రూ.778 కోట్లతో, సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.105 కోట్లతో ఆర్డీఎస్ఎస్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. పనులు పూర్తయిన ప్రాంతాల్లో నాణ్యమైన, అంతరాయంలేని విద్యుత్ సరఫరా అందుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తోందని, రోడ్లు, తాగునీరు, సోలార్ పథకాల అమలుతో అన్ని శాఖలు గాడిలో పడ్డాయని పేర్కొన్నారు.
ఆర్డీఎస్ఎస్‌తో విద్యుత్ మెరుగుదల
ఎస్ పి ఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 18 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం చెర్లోపల్లి, బండేపల్లిలో పూర్తయిన ఆర్డీఎస్ఎస్ విద్యుత్ పనులతో పాటు సిమెంట్ రోడ్డును సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రూ.778 కోట్లతో, సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.105 కోట్లతో ఆర్డీఎస్ఎస్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. పనులు పూర్తయిన ప్రాంతాల్లో నాణ్యమైన, అంతరాయంలేని విద్యుత్ సరఫరా అందుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తోందని, రోడ్లు, తాగునీరు, సోలార్ పథకాల అమలుతో అన్ని శాఖలు గాడిలో పడ్డాయని పేర్కొన్నారు.

