Friday, 31 July 2026
  • Home  
  • వాంకిడిలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 100 శాతం పూర్తి
- News

వాంకిడిలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 100 శాతం పూర్తి

వాంకిడిలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 100 శాతం పూర్తి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుర్నులే నారాయణ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం వాంకిడి, న్యూస్ టుడే: వాంకిడి మండలంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను 100 శాతం పూర్తి చేసినట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్నులే నారాయణ తెలిపారు. గత నెల రోజులుగా మండలంలోని అన్ని గ్రామాల్లో బీఎల్‌ఏలు, బీఎల్‌వోలు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ సవరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలోనే కాకుండా ప్రజా సమస్యల పరిష్కారంలోనూ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సేవలందించడం తమ బాధ్యత అని అన్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు, ప్రజలకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకుడిగా గుర్నులే నారాయణ ప్రజల విశ్వాసాన్ని పొందారని కార్యకర్తలు పేర్కొన్నారు. ప్రజల మధ్య నిరంతరం సేవలందిస్తున్న గుర్నులే నారాయణ సేవలను పార్టీ అధిష్ఠానం గుర్తించి తగిన నామినేటెడ్ పదవి కల్పించాలని మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పలువురు స్థానికులు కోరుతున్నారు. అయితే నామినేటెడ్ పదవుల నియామకం పార్టీ అధిష్ఠానం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని వారు పేర్కొన్నారు.

వాంకిడిలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 100 శాతం పూర్తి

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుర్నులే నారాయణ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం

వాంకిడి, న్యూస్ టుడే:
వాంకిడి మండలంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను 100 శాతం పూర్తి చేసినట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్నులే నారాయణ తెలిపారు. గత నెల రోజులుగా మండలంలోని అన్ని గ్రామాల్లో బీఎల్‌ఏలు, బీఎల్‌వోలు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ సవరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలోనే కాకుండా ప్రజా సమస్యల పరిష్కారంలోనూ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సేవలందించడం తమ బాధ్యత అని అన్నారు.
గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు, ప్రజలకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకుడిగా గుర్నులే నారాయణ ప్రజల విశ్వాసాన్ని పొందారని కార్యకర్తలు పేర్కొన్నారు.
ప్రజల మధ్య నిరంతరం సేవలందిస్తున్న గుర్నులే నారాయణ సేవలను పార్టీ అధిష్ఠానం గుర్తించి తగిన నామినేటెడ్ పదవి కల్పించాలని మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పలువురు స్థానికులు కోరుతున్నారు. అయితే నామినేటెడ్ పదవుల నియామకం పార్టీ అధిష్ఠానం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని వారు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.