వెంకటేశ్వర ఆలయంలో ధన్వంతరి యాగం
పలమనేరు మే31,2020(పున్నమి విలేకరి ):
పలమనేరు రూరల్ మండలం గొల్లపల్లి గ్రామంలోని తిరు వెంకట నగరిలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం నందు జ్యేష్టాభిషేక పూజలను అత్యంత వైభవంగా మూడు రోజుల పాటు నిర్వహించారు ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ధన్వంతరియాగము ,సుదర్శన్ హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి చేసి మంగళ హారతులతో స్వామి వారి యాగాన్ని పరిసమాప్తం చేశారు. పవిత్ర కలశాల్లోని జలాలను శ్రీచక్ర ఆళ్వార్లకు నాగదేవతలకు కుంభ అభిషేకాన్ని నిర్వహించి పూజలను ఘనంగా జరిపారు. సామాజిక దూరం పాటిస్తూ లాక్డౌన్ నిబంధనలతో ఆలయ అర్చకులురంగనాథ ఆచార్యులు ధర్మకర్తల కమిటీ కొద్దిమందితో మాత్రమే పూజా కైంకర్యాలను నిర్వహించారు అనంతరం రంగనాథ ఆచార్యులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయ సహకారాలతో నిర్మించిన ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూని పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం పూజా కైంకర్యాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టిటిడి వారి సహాయ సహకారానికి గ్రామస్తులు తరఫున ఆలయ అర్చకులు కృతజ్ఞతలు తెలిపారు
వెంకటేశ్వర ఆలయంలో ధన్వంతరి యాగం
వెంకటేశ్వర ఆలయంలో ధన్వంతరి యాగం పలమనేరు మే31,2020(పున్నమి విలేకరి ): పలమనేరు రూరల్ మండలం గొల్లపల్లి గ్రామంలోని తిరు వెంకట నగరిలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం నందు జ్యేష్టాభిషేక పూజలను అత్యంత వైభవంగా మూడు రోజుల పాటు నిర్వహించారు ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ధన్వంతరియాగము ,సుదర్శన్ హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి చేసి మంగళ హారతులతో స్వామి వారి యాగాన్ని పరిసమాప్తం చేశారు. పవిత్ర కలశాల్లోని జలాలను శ్రీచక్ర ఆళ్వార్లకు నాగదేవతలకు కుంభ అభిషేకాన్ని నిర్వహించి పూజలను ఘనంగా జరిపారు. సామాజిక దూరం పాటిస్తూ లాక్డౌన్ నిబంధనలతో ఆలయ అర్చకులురంగనాథ ఆచార్యులు ధర్మకర్తల కమిటీ కొద్దిమందితో మాత్రమే పూజా కైంకర్యాలను నిర్వహించారు అనంతరం రంగనాథ ఆచార్యులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయ సహకారాలతో నిర్మించిన ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూని పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం పూజా కైంకర్యాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టిటిడి వారి సహాయ సహకారానికి గ్రామస్తులు తరఫున ఆలయ అర్చకులు కృతజ్ఞతలు తెలిపారు