Sunday, 27 September 2026
  • Home  
  • వర్షం పడితే రహదారి కష్టాలు.. పాల మీద, రెల్లి కాలనీ ప్రజల గోడు!
- అనకాపల్లి

వర్షం పడితే రహదారి కష్టాలు.. పాల మీద, రెల్లి కాలనీ ప్రజల గోడు!

ఎలమంచిలి (అనకాపల్లి జిల్లా బ్యూరో): కొక్కిరపల్లి గ్రామం నుంచి పాల మీద, రెల్లి కాలనీలకు వెళ్లే ప్రధాన రహదారి వర్షం పడితే బురదమయంగా మారి చెరువును తలపిస్తోంది. ఏళ్లుగా సమస్య ఉన్నా ప్రభుత్వాలు మారుతున్నా రహదారి మాత్రం మారడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు కాలనీల్లో సుమారు 150 కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రతి ఇంటి నుంచి ఇంటి పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ కనీస రహదారి సౌకర్యం కల్పించకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వర్షాకాలంలో బురదలో నడవాలంటేనే గ్రామస్థులు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, పనులకు వెళ్లే కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్‌ లేదా ఇతర వాహనం గ్రామానికి చేరుకోవడం కూడా కష్టంగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. వర్షం పడిన ప్రతిసారీ రహదారి మరింత దారుణంగా మారడంతో ఎక్కడికి వెళ్లాలన్నా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారికి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఎలమంచిలి (అనకాపల్లి జిల్లా బ్యూరో):

కొక్కిరపల్లి గ్రామం నుంచి పాల మీద, రెల్లి కాలనీలకు వెళ్లే ప్రధాన రహదారి వర్షం పడితే బురదమయంగా మారి చెరువును తలపిస్తోంది. ఏళ్లుగా సమస్య ఉన్నా ప్రభుత్వాలు మారుతున్నా రహదారి మాత్రం మారడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు కాలనీల్లో సుమారు 150 కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రతి ఇంటి నుంచి ఇంటి పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ కనీస రహదారి సౌకర్యం కల్పించకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వర్షాకాలంలో బురదలో నడవాలంటేనే గ్రామస్థులు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, పనులకు వెళ్లే కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్‌ లేదా ఇతర వాహనం గ్రామానికి చేరుకోవడం కూడా కష్టంగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. వర్షం పడిన ప్రతిసారీ రహదారి మరింత దారుణంగా మారడంతో ఎక్కడికి వెళ్లాలన్నా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారికి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.