ముస్తాబాద్, /మే 2 /పున్నమి ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను వరుసగా పెంచడాన్ని ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొంపెల్లి సురేందర్ రావు తీవ్రంగా ఖండించారు. చిన్న, చిరు వ్యాపారులపై ఈ ధరల పెంపు తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు.
మూడు నెలల్లో మూడుసార్లు ధరలు పెంచడం ప్రజలపై భారంగా మారిందని విమర్శించారు. ఎన్నికలు పూర్తవ్వగానే దరల పెంపులు చేపట్టడం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు


