డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో వైసీపీ యువజన-విద్యార్థి విభాగాల అధ్యక్షులు పిల్లి సూర్య ప్రకాష్, మిండగుదిటి శిరీష్ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చెయ్యాలి అనే నినాదంతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మరియు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నీట్ పరీక్ష పత్రాల లీక్, మెగా డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీకేజీలు, విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి వంటి సమస్యలపై గళం విప్పారు. యువత, నిరుద్యోగులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి వుంగరాల సంతోష్ తెలిపారు. సంతోష్ మాట్లాడుతూ ఈ పోరాటం రాష్ట్రంలోని విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న అన్యాయాలకు వ్యతిరేకంగా చెప్పటిన పోరాటం అని తెలిపారు. మెగా డీఎస్సీ నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారంలో బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకురాకపోతే భవిష్యత్తులో నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజీతో పాటు మెగా డీఎస్సీ అవకతవకల వల్ల నష్టపోయిన విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, ప్రభుత్వం హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐటీ విభాగం అధ్యక్షులు తోరం గౌతం రాజ్, విద్యార్థి విభాగం జోనల్ ఇంచార్జీ జిల్లెళ్ళ రమేష్, ముమ్మిడివరం నియోజకవర్గ నాయకులు జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు గంటి సుధాకర్, జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు పందిరిపల్లి అమర్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు నడింపల్లి సందీప్ వర్మ, నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు పందిరిపల్లి రాజేష్, తాళ్లరేవు మండల యువజన – విద్యార్థి నాయకులు గునిపే విష్ణు, పాము మధు, గంటా దిలీప్, బళ్ల దుర్గాప్రసాద్, అల్లంపల్లి వెంకట రమణ, పితాని నవీన్, బళ్ల సుమన్ తదితరులు పాల్గొన్నారు.

లోకేష్ రాజీనామా కోరుతూ యువజన – విద్యార్థి నాయకుల నిరసన ర్యాలీ వై.యస్.ఆర్.సి.పి రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి – ఉంగరాల సంతోష్