డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ఐ. పోలవరం మండలం మురమళ్ళ గ్రామపంచాయతీ పరిధిలోని 142 వ బూత్ పరిధిలోని ప్రాంతంలో కూటమి ప్రభుత్వం – రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి,సంక్షేమం ఇంటింటా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు.ఈ సందర్భంగా శాసనసభ్యులు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముమ్మిడివరం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తూ ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు చేరేలా కృషి చేస్తోందని తెలిపారు.ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని, ముమ్మిడివరం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అమలు చేసిన రెండేళ్ల ప్రగతిని వివరిస్తూ కరపత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, ఐ. పోలవరం మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు రాజు, సీనియర్ నాయకులు ఆకాశం శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

మురమళ్ళ గ్రామంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం,అభివృద్ధి,సంక్షేమం ఇంటింటా కార్యక్రమం