శ్రీ కాళహస్తి, జులై 16, (పున్నమి టెంపుల్ న్యూస్): తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లును నూతన జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ), ఇంటర్మీడియట్ విద్యాశాఖ ప్రాంతీయ తనిఖీ అధికారి (ఆర్ఐఓ) గోపాల్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ జూనియర్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అధికారులు కలెక్టర్కు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో విద్యావ్యవస్థ బలోపేతం, ప్రభుత్వ కాలేజీలు మరియు పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడంపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. విద్యాసంస్థల పర్యవేక్షణను నిరంతరం కొనసాగిస్తూ, విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు సమర్థవంతంగా పనిచేయాలని నూతన అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖను ప్రగతిపథంలో నడిపిస్తామని ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్కు విన్నవించారు.

జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విద్యాశాఖాధికారులు