కల్లూరు నీటి బావిలో గుర్తుతెలియని శవం కలకలం రేపింది
దొరవారి సత్రం జూలై 28 (పున్నమి న్యూస్)
తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కల్లూరు గ్రామంలోని కోట చెరువుకు సమీపంలో ఉన్న నేలబావిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. పొలం పనులకు వెళ్లిన గ్రామస్తులు మృతదేహాన్ని గుర్తించి వెంటనే దొరవారిసత్రం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


