Sunday, 3 May 2026
  • Home  
  • అమర జవాన్ మురళి నాయక్ స్మరణార్థం క్రికెట్ టోర్నీ ప్రారంభం
- తిరుపతి

అమర జవాన్ మురళి నాయక్ స్మరణార్థం క్రికెట్ టోర్నీ ప్రారంభం

శ్రీకాళహస్తి, మే 03 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని స్కిట్ కళాశాల సమీపంలో ఆపరేషన్ సింధూర్‌లో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ మురళి నాయక్ జ్ఞాపకార్థం ‘మురళి నాయక్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్’ (సూపర్ సిక్స్ సీజన్-2) ఆదివారం అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. సంకల్ప్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రీడా సంబరాలకు హైకోర్టు అడ్వకేట్ రవికుమార్, సామాజిక కార్యకర్త మురళి నాయుడు స్పాన్సర్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. యువతలో దేశభక్తిని పెంపొందించడంతో పాటు వారు దురలవాట్లకు దూరంగా ఉండి శారీరక దారుఢ్యాన్ని సాధించేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. అమర జవాన్ త్యాగాన్ని స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఈ పోటీలకు స్థానిక క్రీడాకారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.