Friday, 5 June 2026
  • Home  
  • లక్కబొమ్మలకు ప్రపంచ ఖ్యాతి… కళాకారులకు మాత్రం కాలుష్య వ్యథ..!
- అనకాపల్లి

లక్కబొమ్మలకు ప్రపంచ ఖ్యాతి… కళాకారులకు మాత్రం కాలుష్య వ్యథ..!

(పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్) అనకాపల్లి జిల్లా, జూన్ 5 ఎలమంచిలి : ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏటికొప్పాక లక్కబొమ్మల కళాకారులు నివసిస్తున్న ఆర్టిజన్స్ కాలనీ తీవ్ర కాలుష్య సమస్యతో ఆందోళన చెందుతోంది. కాలనీ సమీపంలోని వరాహ నది ఒడ్డున గ్రామ చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, మురుగు పదార్థాలను పడేసి నిప్పంటించడం వల్ల వెలువడుతున్న విషవాయువులు కాలనీని కమ్మేస్తున్నాయి. దీంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. సమస్యను పలుమార్లు పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చిన కళాకారుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం బాధాకరమని పేర్కొంటున్నారు. చెత్త దహనాన్ని వెంటనే నిలిపివేసి, కాలుష్యానికి శాశ్వత పరిష్కారం చూపాలని ఆర్టిజన్స్ కాలనీ వాసులు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరుతున్నారు.

(పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్)

అనకాపల్లి జిల్లా, జూన్ 5 ఎలమంచిలి :
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏటికొప్పాక లక్కబొమ్మల కళాకారులు నివసిస్తున్న ఆర్టిజన్స్ కాలనీ తీవ్ర కాలుష్య సమస్యతో ఆందోళన చెందుతోంది. కాలనీ సమీపంలోని వరాహ నది ఒడ్డున గ్రామ చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, మురుగు పదార్థాలను పడేసి నిప్పంటించడం వల్ల వెలువడుతున్న విషవాయువులు కాలనీని కమ్మేస్తున్నాయి. దీంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని స్థానికులు వాపోతున్నారు.
సమస్యను పలుమార్లు పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చిన కళాకారుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం బాధాకరమని పేర్కొంటున్నారు. చెత్త దహనాన్ని వెంటనే నిలిపివేసి, కాలుష్యానికి శాశ్వత పరిష్కారం చూపాలని ఆర్టిజన్స్ కాలనీ వాసులు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.