ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నందలూరు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం కన్యక చెరువు గట్టుపై మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మర్రి, రావి వంటి పర్యావరణ హిత వృక్షాలను నాటారు.
ఈ సందర్భంగా డాక్టర్ జయ భాస్కరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పచ్చదనం పెంపొందించి పర్యావరణ హితానికి తోడ్పడాలని సూచించారు. కాలుష్యాన్ని నివారించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి మొక్కల పెంపకం ఎంతో అవసరమని పేర్కొన్నారు. వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో గతంలో నాటిన మొక్కలను సంరక్షించడం ఆనందదాయకమని తెలిపారు.
ఎస్‌ఐ మన్నెం రామమోహన్ మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించినప్పుడు అది మానవాళికి రక్షణ కవచంగా నిలుస్తుందని అన్నారు. ప్రతి సంవత్సరం నాటిన మొక్కలను సంరక్షించడంతో పాటు మరిన్ని మొక్కలు నాటి అడవుల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తును రక్షించుకోవడమేనని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో ప్రకృతి పట్ల అవగాహన పెంపొందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, ప్రతి గ్రామం హరిత గ్రామంగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో లయన్ కుర్రా మణి యాదవ్, నీటి సంఘం అధ్యక్షుడు బూసెట్టి వెంకటసుబ్బయ్య, వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పు శెట్టి సుధీర్, మోడపోతుల రాము, జంగంశెట్టి హరి, గంధం గంగాధర్, తీగలకుంట వెంకటేష్, పొనబోయిన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ మానవాళి బాధ్యత
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నందలూరు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం కన్యక చెరువు గట్టుపై మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మర్రి, రావి వంటి పర్యావరణ హిత వృక్షాలను నాటారు. ఈ సందర్భంగా డాక్టర్ జయ భాస్కరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పచ్చదనం పెంపొందించి పర్యావరణ హితానికి తోడ్పడాలని సూచించారు. కాలుష్యాన్ని నివారించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి మొక్కల పెంపకం ఎంతో అవసరమని పేర్కొన్నారు. వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో గతంలో నాటిన మొక్కలను సంరక్షించడం ఆనందదాయకమని తెలిపారు. ఎస్‌ఐ మన్నెం రామమోహన్ మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించినప్పుడు అది మానవాళికి రక్షణ కవచంగా నిలుస్తుందని అన్నారు. ప్రతి సంవత్సరం నాటిన మొక్కలను సంరక్షించడంతో పాటు మరిన్ని మొక్కలు నాటి అడవుల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తును రక్షించుకోవడమేనని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో ప్రకృతి పట్ల అవగాహన పెంపొందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, ప్రతి గ్రామం హరిత గ్రామంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లయన్ కుర్రా మణి యాదవ్, నీటి సంఘం అధ్యక్షుడు బూసెట్టి వెంకటసుబ్బయ్య, వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పు శెట్టి సుధీర్, మోడపోతుల రాము, జంగంశెట్టి హరి, గంధం గంగాధర్, తీగలకుంట వెంకటేష్, పొనబోయిన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

