మైలవరం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి పెద్దపీట.
-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.
రూ.7.9 కోట్లతో మూడు ప్రధాన రహదారుల అభివృద్ధికి శంకుస్థాపన.
రెడ్డిగూడెం మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.
ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం, సెప్టెంబర్ 3, 2026:
మైలవరం నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణ ప్రసాదు గారు పేర్కొన్నారు.
ఇందులో భాగంగా రెడ్డిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో మొత్తం రూ.7.9 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మూడు ప్రధాన రహదారుల అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపనలు చేశారు.
రూ.2.2 కోట్ల అంచనా వ్యయంతో విజయవాడ–విస్సన్నపేట ప్రధాన రహదారి నుంచి నరుకుళ్లపాడు వరకు చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు తాటిగూడెం వద్ద ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు శంకుస్థాపన చేశారు.
అదేవిధంగా రూ.3.3 కోట్ల అంచనా వ్యయంతో విజయవాడ–విస్సన్నపేట రహదారి నుంచి అన్నేరావుపేట వరకు నిర్మించనున్న రహదారి అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేశారు.
మరోవైపు రూ.2.4 కోట్ల అంచనా వ్యయంతో ఎం.ఎన్.కె. రోడ్డు నుంచి మాధవరం వరకు వయా కూనపరాజుపర్వ మీదుగా చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఆయా ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఈ పనులు చేపడుతున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, విద్యార్థులు, రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
ప్రధాన రహదారులకు అనుసంధానంగా ఉన్న గ్రామాలకు మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించడం ద్వారా ఆయా గ్రామాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. రహదారుల అభివృద్ధితో వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడంతో పాటు, అత్యవసర సమయాల్లో రాకపోకలు సులభతరం కానున్నాయి.
ఎప్పటినుంచో పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న రహదారి సమస్యలకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు చొరవ తీసుకుని నిధులు మంజూరు చేయించి, పనులకు శంకుస్థాపన చేయడం పట్ల స్థానిక ప్రజలు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నార




