జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో (జూలై పున్నమి)
రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శని వారం జరుగుతున్న ఛలో రామాయపట్నంను విజయవంతం చేయాలని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఇప్పటికైనా నమ్మి ఓట్లు వేసిన పాపానికి, భూములు ఇచ్చి పోర్టు నిర్మాణానికి సహకరించిన రైతన్నలకు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని నమ్మి మోసపోయిన నిరుద్యోగ యువతకు ఇప్పటికైనా కూటమి నేతలు నిజాలు చెప్పాలని మాజీ శాసనసభ్యులు కావలి నియోజకవర్గ వై సిపి ఇన్చార్జి ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు.
రామాయపట్నం పోర్ట్ 2022లో మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసి 95% పూర్తి చేశారని.దాదాపు 850 ఎకరాలలో 3743 కోట్లతో పనులు ప్రారంభిస్తూ భూమి పూజ చేయగా.నాలుగు బెర్తులు నిర్మాణం ద్వారా 25 మిలియన్ టన్నుల కార్గో రవాణా సామర్ధ్యంతో ప్రారంభించి
రామయపట్నం పోర్టులో 70% ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చే విధంగా చట్టం చేశారని తెలిపారు.
పోర్ట్ కి అనుసంధానంగా వచ్చే పరిశ్రమలు చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చే అన్ని ప్రాజెక్టులలో స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తాం అని
రామాయపట్నం పోర్టు పూర్తయి వినియోగంలోనికి వస్తే మత్స్యకార కుటుంబాలకు ఉద్యోగ ఉపాధితో పాటు అభివృద్ధి చెందుతాయనే లక్ష్యంతో
రామాయపట్నం పోర్ట్ లో ఎంత లేదన్న 4000 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని భావించినట్లు తెలిపారు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగాలతో పాటు పారిశ్రామిక అభివృద్ధి జరిగి లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని. పోర్టు నిర్మాణానికి సహకరించిన మొండివానిపాలెం, ఆవులవారి పాలెం, కర్లపాలెం, రావూరు, చేవూరు,సాలిపేట గ్రామాలను అభివృద్ధిలో భాగం చేస్తామనే సంకల్పంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారని ప్రతాప్ రెడ్డి తెలిపారు.
5000 కోట్ల రూపాయల విలువైన రామాయపట్నం పోర్టును చంద్రబాబు అత్యంత కారు చౌకగా 1500 కోట్లుకే ప్రైవేటు వ్యక్తులకు ధారాధత్వం చేస్తుండడం ద్రోహ పూరిత చర్యగా అభివర్ణించారు.
రామాయపట్నం పోర్టును ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ఏపీ మ్యారిటైమ్ బోర్డు బిడ్లును పిలిచింది. ముందుగా బిడ్ల మొత్తంలో సగం అంటే 750 కోట్లు చెల్లిస్తే చాలు అంటున్నారని.మిగిలిన 750 కోట్లు వాణిజ్య కార్యకలాపాలు మొదలుపెట్టిన తర్వాత ఇస్తే సరిపోతుంది అని కూటమి ప్రభుత్వం అంటుండడం గమనించాలని కోరారు.
మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్ కృషితో ప్రభుత్వ రంగంలో సృష్టించిన లక్షల కోట్ల విలువైన ఆస్తుల్ని ప్రైవేటుకు తెగ నమ్ముతున్నారని. గత ప్రభుత్వం సమకూర్చిన విలువైన ఆస్తి రామాయపట్నం పోర్టు అని అన్నారు.
గత వైయస్ జగన్ ప్రభుత్వంలో 850 ఎకరాలలో భూమి విలువలతో కలిపి ₹4929 కోట్లతో అభివృద్ధి చేయగా. కూటమి ప్రభుత్వం 50 ఏళ్ల దీర్ఘకాలానికి ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారని పేర్కొన్నారు.
ఇప్పటికే ఈప్రాజెక్టు కోసం ఏపీ మారిటైమ్ బోర్డు తీసుకున్న 2079 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుందని
కేవలం చంద్రబాబు దురుద్దేశంతో రామాయపట్నం పోర్టు ఎక్కడ పూర్తయితే జగన్ కు మంచి పేరు వస్తుందోనని అన్ని హంగులతో ఉన్న పోర్టును ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి సిద్ధపడ్డారని. వేలకోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే పోర్టును తన స్వార్ధ బుద్ధితో బలి పెడుతున్నారని అని తీవ్రంగా విమర్శించారు.
రామయపట్నం ప్రైవేటీకరణపై రాజీ లేని పోరు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి
జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో (జూలై పున్నమి) రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శని వారం జరుగుతున్న ఛలో రామాయపట్నంను విజయవంతం చేయాలని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికైనా నమ్మి ఓట్లు వేసిన పాపానికి, భూములు ఇచ్చి పోర్టు నిర్మాణానికి సహకరించిన రైతన్నలకు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని నమ్మి మోసపోయిన నిరుద్యోగ యువతకు ఇప్పటికైనా కూటమి నేతలు నిజాలు చెప్పాలని మాజీ శాసనసభ్యులు కావలి నియోజకవర్గ వై సిపి ఇన్చార్జి ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. రామాయపట్నం పోర్ట్ 2022లో మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసి 95% పూర్తి చేశారని.దాదాపు 850 ఎకరాలలో 3743 కోట్లతో పనులు ప్రారంభిస్తూ భూమి పూజ చేయగా.నాలుగు బెర్తులు నిర్మాణం ద్వారా 25 మిలియన్ టన్నుల కార్గో రవాణా సామర్ధ్యంతో ప్రారంభించి రామయపట్నం పోర్టులో 70% ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చే విధంగా చట్టం చేశారని తెలిపారు. పోర్ట్ కి అనుసంధానంగా వచ్చే పరిశ్రమలు చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చే అన్ని ప్రాజెక్టులలో స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తాం అని రామాయపట్నం పోర్టు పూర్తయి వినియోగంలోనికి వస్తే మత్స్యకార కుటుంబాలకు ఉద్యోగ ఉపాధితో పాటు అభివృద్ధి చెందుతాయనే లక్ష్యంతో రామాయపట్నం పోర్ట్ లో ఎంత లేదన్న 4000 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని భావించినట్లు తెలిపారు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగాలతో పాటు పారిశ్రామిక అభివృద్ధి జరిగి లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని. పోర్టు నిర్మాణానికి సహకరించిన మొండివానిపాలెం, ఆవులవారి పాలెం, కర్లపాలెం, రావూరు, చేవూరు,సాలిపేట గ్రామాలను అభివృద్ధిలో భాగం చేస్తామనే సంకల్పంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారని ప్రతాప్ రెడ్డి తెలిపారు. 5000 కోట్ల రూపాయల విలువైన రామాయపట్నం పోర్టును చంద్రబాబు అత్యంత కారు చౌకగా 1500 కోట్లుకే ప్రైవేటు వ్యక్తులకు ధారాధత్వం చేస్తుండడం ద్రోహ పూరిత చర్యగా అభివర్ణించారు. రామాయపట్నం పోర్టును ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ఏపీ మ్యారిటైమ్ బోర్డు బిడ్లును పిలిచింది. ముందుగా బిడ్ల మొత్తంలో సగం అంటే 750 కోట్లు చెల్లిస్తే చాలు అంటున్నారని.మిగిలిన 750 కోట్లు వాణిజ్య కార్యకలాపాలు మొదలుపెట్టిన తర్వాత ఇస్తే సరిపోతుంది అని కూటమి ప్రభుత్వం అంటుండడం గమనించాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్ కృషితో ప్రభుత్వ రంగంలో సృష్టించిన లక్షల కోట్ల విలువైన ఆస్తుల్ని ప్రైవేటుకు తెగ నమ్ముతున్నారని. గత ప్రభుత్వం సమకూర్చిన విలువైన ఆస్తి రామాయపట్నం పోర్టు అని అన్నారు. గత వైయస్ జగన్ ప్రభుత్వంలో 850 ఎకరాలలో భూమి విలువలతో కలిపి ₹4929 కోట్లతో అభివృద్ధి చేయగా. కూటమి ప్రభుత్వం 50 ఏళ్ల దీర్ఘకాలానికి ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఈప్రాజెక్టు కోసం ఏపీ మారిటైమ్ బోర్డు తీసుకున్న 2079 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుందని కేవలం చంద్రబాబు దురుద్దేశంతో రామాయపట్నం పోర్టు ఎక్కడ పూర్తయితే జగన్ కు మంచి పేరు వస్తుందోనని అన్ని హంగులతో ఉన్న పోర్టును ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి సిద్ధపడ్డారని. వేలకోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే పోర్టును తన స్వార్ధ బుద్ధితో బలి పెడుతున్నారని అని తీవ్రంగా విమర్శించారు.

