రాజమహేంద్రవరం, జూలై 23 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
రంపచోడవరం పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి రాజమహేంద్రవరం విమానాశ్రయంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అనంతరం రంపచోడవరం పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.



