మనుబోలు మండలం పిడూరు గ్రామంలో గత మూడు రోజులుగా జరుగుతున్న తిరుణాలలో ఎమ్మెల్యే సోమిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.స్వామి అమ్మవార్లకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ వేడుకలు గ్రామంలో ఆధ్యాత్మిక శోభను నింపాయి.

పిడూరులో ఘనంగా చెన్నకేశవ స్వామి ప్రతిష్టా మహోత్సవం