యాచారం మండల ఉపసర్పంచ్‌ల ఫోరం ఎన్నిక సమావేశం విజయవంతం
పున్నమి న్యూస్
15 జూన్ 2026
తెలంగాణ ఇంచార్జి
ఈరోజు యాచారం మండల కేంద్రంలోని సాయి శరణం ఫంక్షన్ హాల్ లో యాచారం మండల ఉపసర్పంచ్‌ల ఫోరం ఎన్నికల సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల ఉపసర్పంచ్‌లు పాల్గొని, ఏకగ్రీవంగా ఫోరం కమిటీని ఎన్నుకున్నారు.
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు:
అధ్యక్షుడు:
• మచ్చ అనిల్ కుమార్ (గునగల్ ఉప సర్పంచ్)
ఉపాధ్యక్షుడు:
• విస్లావత్ రాజు (తక్కళ్ళపల్లి తండా ఉప సర్పంచ్)
ప్రధాన కార్యదర్శి:
• దెంది మధుకర్ రెడ్డి (మేడిపల్లి ఉప సర్పంచ్)
జాయింట్ కార్యదర్శులు:
• గౌర నాగరాజు (ధర్మన్నగూడ ఉప సర్పంచ్)
• అనమోని రవీందర్ (కుర్మిద్దా ఉప సర్పంచ్)
ఖజాంచి (ట్రెజరర్):
• రెడ్డమోని శిరీష – వెంకటేష్ యాదవ్ (మల్కీజ్‌గూడ ఉప సర్పంచ్)
ఎగ్జిక్యూటివ్ సభ్యులు:
1. కుమ్మరిగూడెం మంగ కృష్ణ (యాచారం ఉప సర్పంచ్)
2. గౌర లక్ష్మణ్ (గడ్డమల్లయ్యగూడ ఉప సర్పంచ్)
3. నాయిని శ్రీకాంత్ (చింతూల్లా ఉప సర్పంచ్)
4. అనిత – రమేష్ (కొత్తపల్లి ఉప సర్పంచ్)
5. మల్లమ్మ (మాల్ ఉప సర్పంచ్)
6. సువర్ణ – వెంకటేష్ (తక్కళ్ళపల్లి ఉప సర్పంచ్)
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు సమావేశంలో పాల్గొన్న ఉపసర్పంచ్‌లు శుభాకాంక్షలు తెలియజేశారు. యాచారం మండలంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధి, ఉపసర్పంచ్‌ల సమస్యల పరిష్కారం మరియు స్థానిక సంస్థల బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు.
యాచారం మండల ఉపసర్పంచ్‌ల ఫోరం తరఫున నూతన కమిటీకి హృదయపూర్వక అభినందనలు.



