‘దేశమంటే మనుషులోయ్’ సందేశాన్ని చాటిన మహనీయుడి సేవల స్మరణ
పున్నమి ప్రతినిధి ఆనంద్
యలమంచిలి శాఖా గ్రంథాలయంలో సోమవారం మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు 164వ జయంతిని ఘనంగా నిర్వహించారు. గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆధునిక భావ కవిత్వానికి మార్గదర్శకుడిగా, సామాజిక సంస్కరణలకు కృషి చేసిన మహనీయుడిగా ఆయన సేవలను కార్యక్రమంలో స్మరించుకున్నారు. “దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్” అంటూ సమాజానికి గురజాడ అందించిన సందేశాన్ని గుర్తుచేశారు. కార్యక్రమానికి ఆడారి పూరి జగన్నాథం అధ్యక్షత వహించగా, గ్రంథాలయాధికారి వి. ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రిటైర్డ్ ఉపాధ్యాయులు సోమయాజులు సన్యాసి బాబు, వై. అప్పారావు, ఫిజికల్ డైరెక్టర్ కె. దుర్గారావు, విద్యార్థులు పాల్గొన్నారు.


