Wednesday, 9 September 2026
  • Home  
  • మాదకద్రవ్యాల నిర్మూలనకు సమష్టి కృషి అవసరం యువతను వ్యసనాల నుంచి దూరం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే నల్లమిల్లి
- తూర్పు గోదావరి

మాదకద్రవ్యాల నిర్మూలనకు సమష్టి కృషి అవసరం యువతను వ్యసనాల నుంచి దూరం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే నల్లమిల్లి

గొల్లల మామిడాడ, ఆగస్టు 22 (పున్నమి ప్రతినిధి): మాదకద్రవ్యాల వినియోగాన్ని నిర్మూలించి డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని ఏఆర్‌సీ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన ‘‘డ్రగ్స్‌ రహిత సమాజం–మాదకద్రవ్యాల వినియోగ నిర్మూలన’’ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మాదకద్రవ్యాల వల్ల యువతలో నేరప్రవృత్తి పెరిగే ప్రమాదం ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ అవసరమైన సమయంలో కౌన్సెలింగ్‌, వైద్య సహాయం అందించాలని సూచించారు. విద్యార్థులపై ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. మాదకద్రవ్యాల నిర్మూలన కేవలం పోలీసుల బాధ్యత కాదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. యువతలో శాశ్వత మార్పు తీసుకురావడానికి అవగాహన, కౌన్సెలింగ్‌ కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఆశా వర్కర్లు, సచివాలయ ఉద్యోగులు, మండలాధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

గొల్లల మామిడాడ, ఆగస్టు 22 (పున్నమి ప్రతినిధి): మాదకద్రవ్యాల వినియోగాన్ని నిర్మూలించి డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని ఏఆర్‌సీ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన ‘‘డ్రగ్స్‌ రహిత సమాజం–మాదకద్రవ్యాల వినియోగ నిర్మూలన’’ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

మాదకద్రవ్యాల వల్ల యువతలో నేరప్రవృత్తి పెరిగే ప్రమాదం ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ అవసరమైన సమయంలో కౌన్సెలింగ్‌, వైద్య సహాయం అందించాలని సూచించారు. విద్యార్థులపై ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

మాదకద్రవ్యాల నిర్మూలన కేవలం పోలీసుల బాధ్యత కాదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

యువతలో శాశ్వత మార్పు తీసుకురావడానికి అవగాహన, కౌన్సెలింగ్‌ కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఆశా వర్కర్లు, సచివాలయ ఉద్యోగులు, మండలాధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.