Wednesday, 27 May 2026
  • Home  
  • మహానాడు సాక్షిగా టిడిపి శక్తి ప్రదర్శన…
- అనకాపల్లి

మహానాడు సాక్షిగా టిడిపి శక్తి ప్రదర్శన…

పురుషోత్తపురంలో పసుపు జెండాలతో మార్మోగిన పార్టీ శ్రేణులు… అనకాపల్లి జిల్లా, మే 27 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్) పురుషోత్తపురం గ్రామం లో టిడిపి మహానాడు 2026 వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మాజీ ఎంపీపీ విజయబాబు, మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని గ్రామాన్ని పసుపుమయం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహానాడు కార్యక్రమం పార్టీ బలోపేతానికి, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు కీలక వేదికగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏటికొప్పాక గ్రామ సర్పంచ్ బజంత్రీల లక్ష్మి, సర్పంచ్ కుమారుడు శ్రీను, కర్రి సింహాచలం, ఊడి రామకృష్ణ, పెదపాటి శరత్, దేవరపు మోహన్, దారా పోలిశెట్టి, పోలుమూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరై మహానాడు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

పురుషోత్తపురంలో పసుపు జెండాలతో మార్మోగిన పార్టీ శ్రేణులు…

అనకాపల్లి జిల్లా, మే 27
(పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్)
పురుషోత్తపురం గ్రామం లో టిడిపి మహానాడు 2026 వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మాజీ ఎంపీపీ విజయబాబు, మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని గ్రామాన్ని పసుపుమయం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహానాడు కార్యక్రమం పార్టీ బలోపేతానికి, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు కీలక వేదికగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏటికొప్పాక గ్రామ సర్పంచ్ బజంత్రీల లక్ష్మి, సర్పంచ్ కుమారుడు శ్రీను, కర్రి సింహాచలం, ఊడి రామకృష్ణ, పెదపాటి శరత్, దేవరపు మోహన్, దారా పోలిశెట్టి, పోలుమూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరై మహానాడు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.