శ్రీకాళహస్తి, మే 08 (పున్నమి న్యూస్): రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను శుక్రవారం బీజేపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీకి తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి, ప్రజా సమస్యలపై మంత్రితో చర్చించినట్లు నాయకులు తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా కలిసిన నేతలు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో రేణిగుంట మండల ఉపాధ్యక్షులు రాజా రాయల్, పట్టణ అధ్యక్షులు నరేష్ రాయల్‌తో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను కలిసిన బీజేపీ నేతలు