శ్రీకాళహస్తి, మే 08 (పున్నమి న్యూస్): గత 23 నెలల ఎన్డీయే కూటమి పాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో వేగంగా ముందుకు సాగుతోందని శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పెట్టుబడుల సాధన, ఉపాధి అవకాశాలపై వివరాలు వెల్లడించారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ.10,090 కోట్ల ఆర్థిక సాయం అందించి ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద 46 లక్షల మంది రైతులకు మూడు విడతల్లో రూ.8,985 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. ‘దీపం-2’ పథకం ద్వారా ఇప్పటికే కోట్లాది గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారని, ‘ఎన్టీఆర్ భరోసా’ కింద సామాజిక పింఛన్ల కోసం రూ.63 వేల కోట్లకు పైగా వ్యయం చేసి పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు అనుకూల వేదికగా తీర్చిదిద్దడంతో దేశీ, విదేశీ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు ఆసక్తి చూపుతున్నారని నాయకులు తెలిపారు. దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో ఏపీ 25.3 శాతం వాటా సాధించడం విశేషమన్నారు. సీఐఐ సమ్మిట్‌లో రూ.11.38 లక్షల కోట్ల విలువైన 538 ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా సుమారు 14 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం ఐటీ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందుతుండగా, రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్, శ్రీకాళహస్తి పట్టణ సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్ డి.వి.నారాయణ,శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమం–అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తోంది-టీడీపీ నాయకులు