గాయపడిన బాధితులకు ఆసుపత్రిలో పరామర్శ
జీపు బోల్తా పడి పార్డి (బి )గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడంతో పాటు ఏడుగురికి తీవ్ర గాయాలు కావడంతో బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పరామర్శించారు. పోస్టుమార్టం గదిలో మృతదేహాలను పరిశీలించి, జరిగిన సంఘటన ను అడిగి తెలుసుకున్నారు. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని బాధితులను ఓదార్చారు. అనంతరం డాక్టర్ ప్రీతం ఆసుపత్రి, జిడిఆర్ హాస్పిటల్, వెంకటేశ్వర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో ఓకే గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాల్సిందిగా డాక్టర్లకు ఎమ్మెల్యే సూచించారు.

బైంసా ఏరియా ఆసుపత్రిలో పార్డి (బి ) మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
గాయపడిన బాధితులకు ఆసుపత్రిలో పరామర్శ జీపు బోల్తా పడి పార్డి (బి )గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడంతో పాటు ఏడుగురికి తీవ్ర గాయాలు కావడంతో బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పరామర్శించారు. పోస్టుమార్టం గదిలో మృతదేహాలను పరిశీలించి, జరిగిన సంఘటన ను అడిగి తెలుసుకున్నారు. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని బాధితులను ఓదార్చారు. అనంతరం డాక్టర్ ప్రీతం ఆసుపత్రి, జిడిఆర్ హాస్పిటల్, వెంకటేశ్వర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో ఓకే గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాల్సిందిగా డాక్టర్లకు ఎమ్మెల్యే సూచించారు.

