నర్సంపేట: బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంపై దాడి చేయడంతో పాటు నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుల ఇంటిపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ పార్టీకి చెందిన గూండాల చర్యలను బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా బిజెపి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయంగా బీజేపీని ఎదుర్కొనే ధైర్యం లేకనే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాలి తప్ప, ప్రత్యర్థి పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం, నాయకుల ఇళ్లపైకి వెళ్లి భయభ్రాంతులకు గురిచేయడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు.
రాజకీయ సిద్ధాంతాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి.. రాళ్లు, కర్రలు, దాడులతో కాదు. బీజేపీ కార్యాలయంపై దాడి అంటే అది ఒక పార్టీపై దాడి మాత్రమే కాదు.. ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడి అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ కక్షలు, దాడుల సంస్కృతికి తెరలేపడం దురదృష్టకరమన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టాలని ఎవరైనా ప్రయత్నిస్తే అది ఎన్నటికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇలాంటి దాడులకు పాల్పడిన వారిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నాంపల్లి ఘటనకు నిరసనగా ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ విలువలను కాపాడేందుకు బీజేపీ శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో తన పోరాటాన్ని కొనసాగిస్తుందని డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు.
దాడులతో బీజేపీని అడ్డుకోలేరు.. ప్రజా పోరాటంతో కాంగ్రెస్కు తగిన సమాధానం చెబుతాం అని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో..28వార్డ్ కౌన్సిలర్ జూలూరి రోజా రాణి, పార్లమెంట్ కొ-కన్వీనర్ కట్ల రాంచేందర్ రెడ్డి, ,జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి జీవన్, కీసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్,నియోజకవర్గ నాయకులు జూలూరి మనిష్ గౌడ్, నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్, నల్లబెల్లి మండల అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ ,నెక్కొండ మండల అధ్యక్షులు నాయిని అశోక్, దుగ్గొండి మండల అధ్యక్షులు రాజేందర్, చెన్నారావుపేట్ మండల అధ్యక్షులు శేఖర్, సినియర్ నాయకులు కోమల్ రెడ్డి, అబోతు రాజు, బాల్నే జగన్, మహేందర్ రెడ్డి, దుంకా దువ్వ రంజిత్,అన్న లింగయ్య, బచ్చు ఎంకన్న, సమ్మయ్య, నూనె రంజిత్, మహిళా నాయకురాలు సరిత, ప్రతిక్ష సింగ్, కాసుల నాగేంద్రబాబు, వల్లె పర్వతాలు, ముత్యాల శ్రీనివాస్ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్,ఉపాధ్యక్షులు కొంకిసా విగ్నేష్ గౌడ్, ఎర్ర రాజు, శివ, మరియు నియోజకవర్గ బిజెపి నాయకులు కార్యకర్తలు, యువ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు..

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై, నల్గొండ జిల్లా అధ్యక్షుల ఇంటిపై దాడి హేయమైన చర్య
నర్సంపేట: బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంపై దాడి చేయడంతో పాటు నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుల ఇంటిపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ పార్టీకి చెందిన గూండాల చర్యలను బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా బిజెపి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయంగా బీజేపీని ఎదుర్కొనే ధైర్యం లేకనే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాలి తప్ప, ప్రత్యర్థి పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం, నాయకుల ఇళ్లపైకి వెళ్లి భయభ్రాంతులకు గురిచేయడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. రాజకీయ సిద్ధాంతాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి.. రాళ్లు, కర్రలు, దాడులతో కాదు. బీజేపీ కార్యాలయంపై దాడి అంటే అది ఒక పార్టీపై దాడి మాత్రమే కాదు.. ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడి అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ కక్షలు, దాడుల సంస్కృతికి తెరలేపడం దురదృష్టకరమన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టాలని ఎవరైనా ప్రయత్నిస్తే అది ఎన్నటికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇలాంటి దాడులకు పాల్పడిన వారిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాంపల్లి ఘటనకు నిరసనగా ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ విలువలను కాపాడేందుకు బీజేపీ శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో తన పోరాటాన్ని కొనసాగిస్తుందని డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. దాడులతో బీజేపీని అడ్డుకోలేరు.. ప్రజా పోరాటంతో కాంగ్రెస్కు తగిన సమాధానం చెబుతాం అని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో..28వార్డ్ కౌన్సిలర్ జూలూరి రోజా రాణి, పార్లమెంట్ కొ-కన్వీనర్ కట్ల రాంచేందర్ రెడ్డి, ,జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి జీవన్, కీసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్,నియోజకవర్గ నాయకులు జూలూరి మనిష్ గౌడ్, నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్, నల్లబెల్లి మండల అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ ,నెక్కొండ మండల అధ్యక్షులు నాయిని అశోక్, దుగ్గొండి మండల అధ్యక్షులు రాజేందర్, చెన్నారావుపేట్ మండల అధ్యక్షులు శేఖర్, సినియర్ నాయకులు కోమల్ రెడ్డి, అబోతు రాజు, బాల్నే జగన్, మహేందర్ రెడ్డి, దుంకా దువ్వ రంజిత్,అన్న లింగయ్య, బచ్చు ఎంకన్న, సమ్మయ్య, నూనె రంజిత్, మహిళా నాయకురాలు సరిత, ప్రతిక్ష సింగ్, కాసుల నాగేంద్రబాబు, వల్లె పర్వతాలు, ముత్యాల శ్రీనివాస్ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్,ఉపాధ్యక్షులు కొంకిసా విగ్నేష్ గౌడ్, ఎర్ర రాజు, శివ, మరియు నియోజకవర్గ బిజెపి నాయకులు కార్యకర్తలు, యువ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు..

