బిక్కవోలు, ఆగస్టు 18 (పున్నమి ప్రతినిధి): భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులైన రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురందరేశ్వరి గారికి ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులు శ్రీ పల్లి శ్రీనివాసరెడ్డి (వాసు) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీలో జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టడం రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. పురందరేశ్వరి గారి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని, ప్రజాసేవలో ఆమె మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
అలాగే బిక్కవోలు గ్రామానికి చెందిన కూటమి (ఎన్‌డీఏ) నాయకులు, కార్యకర్తలు కూడా శ్రీమతి దగ్గుబాటి పురందరేశ్వరి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు భవిష్యత్తులో మరిన్ని విజయాలు చేకూరాలని వారు ఆకాంక్షించారు.


