ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 23 (పున్నమి ప్రతినిధి)
పొదలకూరు: శ్రావణమాసం సందర్భంగా శుభకార్యాలు, ఆలయాలకు వెళ్లే మహిళలు బంగారు ఆభరణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఐ వెంకట్రావు సూచించారు. రద్దీ ప్రాంతాల్లో నగల చోరీలకు అవకాశం ఉన్నందున మెడలోని ఆభరణాలు కనిపించకుండా పైట చెంగుతో కప్పుకోవాలని తెలిపారు. బస్సులు, ఆటోలు, ఆలయాలు, శుభకార్యాల వద్ద అపరిచితుల కదలికలను గమనించాలని సూచించారు. పొదలకూరు, మనుబోలు పట్టణాలతో పాటు ప్రధాన గ్రామాల్లోని కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

బంగారు నగలపై కన్ను.. మహిళలు అప్రమత్తంగా ఉండాలి పొదలకూరు: శ్రావణమాసం సందర్భంగా శుభకార్యాలు,
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 23 (పున్నమి ప్రతినిధి) పొదలకూరు: శ్రావణమాసం సందర్భంగా శుభకార్యాలు, ఆలయాలకు వెళ్లే మహిళలు బంగారు ఆభరణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఐ వెంకట్రావు సూచించారు. రద్దీ ప్రాంతాల్లో నగల చోరీలకు అవకాశం ఉన్నందున మెడలోని ఆభరణాలు కనిపించకుండా పైట చెంగుతో కప్పుకోవాలని తెలిపారు. బస్సులు, ఆటోలు, ఆలయాలు, శుభకార్యాల వద్ద అపరిచితుల కదలికలను గమనించాలని సూచించారు. పొదలకూరు, మనుబోలు పట్టణాలతో పాటు ప్రధాన గ్రామాల్లోని కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

