Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

పాడి రైతులకు హెల్త్ కార్డులు, ఇత్తడి బిందెల పంపిణీ..!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పాడి రైతులకు హెల్త్ కార్డులు, ఇత్తడి బిందెల పంపిణీ..!

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ – రిపోర్టర్ ఆనంద్ మామిడివాడ: పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా, పాల ఉత్పత్తిని పెంచేందుకు కష్టపడుతున్న రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో విశాఖ డెయిరీ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో హెల్త్ కార్డులు, ఇత్తడి బిందెల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా విశాఖ డెయిరీ మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ..
  • పాడి రైతుల సంక్షేమం, అభివృద్ధికి సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.

పున్నమి న్యూస్ – రిపోర్టర్ ఆనంద్

మామిడివాడ: పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా, పాల ఉత్పత్తిని పెంచేందుకు కష్టపడుతున్న రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో విశాఖ డెయిరీ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో హెల్త్ కార్డులు, ఇత్తడి బిందెల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విశాఖ డెయిరీ మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పాడి రైతుల సంక్షేమం, అభివృద్ధికి సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. పాల ఉత్పత్తి పెంపునకు రైతులకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడటమే తమ లక్ష్యమన్నారు. రైతుల కృషికి గుర్తింపుగా ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో సూపర్‌వైజర్ గణేష్, పాల సంఘం అధ్యక్షుడు పప్పల కోటేశ్వరరావు, వేతన కార్యదర్శి కరెడ్ల నాగరాజు, మాజీ పాల సంఘం అధ్యక్షుడు కరెడ్ల రమణ, నెట్టెం శ్రీనివాసరావు, సహాయకుడు నక్కపల్లి అప్పారావు, తేటకవి వెంకట సూర్య ప్రకాష్, వైఎస్సార్సీపీ నాయకుడు మోటూరు రాఘవేంద్ర, పాలకవర్గ సభ్యులు, పలువురు పాడి రైతులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే లక్ష్యం.. పాడి రైతుల అభివృద్ధే ధ్యేయం.. పాల ఉత్పత్తి పెంపునకు ప్రోత్సాహమే మా బాధ్యత అని విశాఖ డెయిరీ మేనేజర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *