-
*
***
నెల్లూరు నగరంలో ఫూలే టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు అన్నం శ్రీనివాసులు, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వాసిలి సురేష్, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి తుమ్మా రవి, నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి. రత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు అన్నం శ్రీనివాసులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి ఎప్రిల్ 11 సందర్భంగా మహాత్మా జ్యోతి రావు ఫూలే గురించి వ్యాస రచన, కవితలు మరియు పాటల రచనా పోటీలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని, సమాచారాన్ని టెక్స్ట్ మెసేజ్ రూపంలో పంపగలరని, ఎంపిక చేయబడిన కవితలు, పాటలు, వ్యాసాలు పుస్తకం రూపంలో ప్రచురించబడునని తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు వారు ఫోన్ నెంబరు 9494615360 కు వాట్సాప్ ద్వారా పంపాలని తెలిపారు. ఈ పోటీలకు చివరి తేది 1/4/2025 అని, పాల్గొన్నవారికి ప్రశంసాపత్రాలు అందజేయబడునని తెలిపారు.మార్చి 23 తేదీన స్వాతంత్ర్యం కోసం ఉరితీయబడ్డ యువ కిషోరాలు భగత్ సింగ్, రాజ్ గురు,సుఖదేవ్ ల వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ స్వాతంత్ర్య ఫలాలను సామాన్యులకు సైతం అందుబాటులో వచ్చేందుకు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని కోరారు.
* *** నెల్లూరు నగరంలో ఫూలే టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు అన్నం శ్రీనివాసులు, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వాసిలి సురేష్, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి తుమ్మా రవి, నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి. రత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు అన్నం శ్రీనివాసులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి ఎప్రిల్ 11 సందర్భంగా మహాత్మా జ్యోతి రావు ఫూలే గురించి వ్యాస రచన, కవితలు మరియు పాటల రచనా పోటీలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని, సమాచారాన్ని టెక్స్ట్ మెసేజ్ రూపంలో పంపగలరని, ఎంపిక చేయబడిన కవితలు, పాటలు, వ్యాసాలు పుస్తకం రూపంలో ప్రచురించబడునని తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు వారు ఫోన్ నెంబరు 9494615360 కు వాట్సాప్ ద్వారా పంపాలని తెలిపారు. ఈ పోటీలకు చివరి తేది 1/4/2025 అని, పాల్గొన్నవారికి ప్రశంసాపత్రాలు అందజేయబడునని తెలిపారు.మార్చి 23 తేదీన స్వాతంత్ర్యం కోసం ఉరితీయబడ్డ యువ కిషోరాలు భగత్ సింగ్, రాజ్ గురు,సుఖదేవ్ ల వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ స్వాతంత్ర్య ఫలాలను సామాన్యులకు సైతం అందుబాటులో వచ్చేందుకు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని కోరారు.