గాజువాక జనవరి (పున్నమి ప్రతినిధి)
గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సంక్రాంతి ప్రీమియర్ లీగ్–2 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు,గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు,టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాధం పాల్గొని టోర్నమెంట్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి పెట్టాలని సూచించారు.టోర్నమెంట్‌లో పాల్గొన్న క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.బొండా జగన్నాధం మాట్లాడుతూ సిద్ధార్థ నగర్‌కు ఆనుకుని నాలుగున్నర ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి జీవీఎంసీ నిధులు మంజూరు చేయించడంలో పల్లా శ్రీనివాసరావు కీలక పాత్ర పోషించారని తెలిపారు.ఇచ్చిన మాట ప్రకారం ఈ సంక్రాంతి సంబరాలను అదే కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయరామరాజు,సెక్రటరీ బొట్టా ప్రకాష్,ఇతర నాయకులు,గ్రామస్తులు,క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




