గోనెగండ్ల: రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు, ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి గారి సూచనలు, ఆదేశాలతో గోనెగండ్ల మండలం బోదేపాడు గ్రామంలో “ప్రతి ఇంటికి తెలుగుదేశం” కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు.
కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని నాయకులు తెలిపారు.
ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ, పార్టీ కార్యక్రమాలను ప్రతి గడపకు తీసుకెళ్లడమే “ప్రతి ఇంటికి తెలుగుదేశం” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గోనెగండ్ల మండల టీడీపీ నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ నాయకులు, కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు.
“ప్రతి ఇంటికి తెలుగుదేశం – ప్రతి కుటుంబానికి సంక్షేమం, ప్రతి గ్రామానికి అభివృద్ధి” అనే నినాదంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.



