బద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 31, (పున్నమి ప్రతినిధి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశాల మేరకు అధికారులు ఉదయం 10 గంటలకే కలెక్టరేట్‌కు హాజరుకావాలని సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా అధికారులకు సమర్పించవచ్చని తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించే ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిశీలించి, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణిలో వ్యక్తిగత సమస్యలతో పాటు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతులు, భూ సంబంధిత అంశాలపై ఫిర్యాదులు స్వీకరించనున్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.



