అనకాపల్లి : పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్
యలమంచిలి :సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఒకపక్క దేవి దేవతల ఉత్సవాలు, మరో ప్రక్క ఎన్నికల హడావిడితో ప్రజలు సందడిగా ఉంటారని, దీన్ని పరిగణలో తీసుకొని రెండు నెలలు పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు. సోమవారం నాడు గ్రామీణ పోలీస్ స్టేషన్లో సచివాలయం మహిళా పోలీసులకు సమావేశం ఏర్పాటు చేసి సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ నెలలో జరిగే వినాయక చవితి ఉత్సవాలు, అక్టోబర్ లో జరిగే దసరా వేడుకల్లో ను, అలాగే ఈ రెండు నెలలో జరిగే స్థానిక ఎన్నికలు దృశ్య పోలీసులు అప్రమత్తమై ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎటువంటి సంఘటనలు తమ దృష్టిలోకి వచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం తెలియచేయాలని ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు.


