పున్నమి ప్రతినిధి, తాళ్లపూడి, మే 05: తాళ్లపూడి మండలం పైడిమెట్ట గ్రామం పదవ వార్డులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిమెంటు రోడ్డుపై డ్రైనేజీ నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు విపరీతంగా పెరిగి, పరిసర ప్రాంతాల్లో అంటువ్యాధుల భయం నెలకొంది. వర్షాకాలంలో మోకాళ్ల లోతు వరకు నీరు నిల్వ ఉండటం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. స్థానిక నాయకులు, పంచాయతీ సిబ్బంది సమస్యను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి మురుగునీరు తొలగించే చర్యలు చేపట్టి శుభ్రత కల్పించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పైడిమెట్ట వార్డులో మురుగునీటి సమస్యపై ప్రజల ఆగ్రహం