ఖమ్మం మే
పున్నమి న్యూస్ జిల్లా ప్రతినిధి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో
వేంసూరు మండలం కుంచపర్తి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వేంసూర్ ఎస్సై కవిత తెలిపారు.
కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఆదేశాల మేరకు, విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.6,800 నగదు, 6 మోటార్ సైకిళ్లు, 3 మొబైల్ ఫోన్లు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అరెస్టు చేసిన వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.



