ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఖమ్మం నగరం లో శుక్రవారం సాయంత్రం 4.30 నిముషాలు నుండి 5 గంటలవరకు కురసిన వర్షానికి రోడ్డు మీద మురుగు నీరు తీవ్ర స్థాయి లో ప్రవహించినది. ఈ నేపథ్యంలో లో ఖమ్మం రెండవ పట్టణ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ గట్టయ్య సెంటర్ కవిత కాలేజ్ దగ్గర నుండి స్థానిక కొత్త కార్పొరేషన్ కార్యాలయం వరకు పరీశీలించి మాట్లాడుతూ ముగ్గురు మంత్రుల ముద్దుల నగరం ఖమ్మం అని అభివృద్ధి లో మాత్రం ఖమ్మం నగరం ని పట్టించు కునే నాదుడే లేడని విమర్శలు చేసారు. ఎన్నికల ప్పుడు ఓట్లు కోసం హామీల కీ అమలు కానీ ఉచిత హామీలు గుప్పిస్తారని అయన అన్నారు. ప్రజలు ఇప్పటి కీ అయినా మార్పు కోరుకోవాలని అని అన్నారు. ముగ్గురు మంత్రుల్లో ఏ మంత్రి ఖమ్మం నగరము ని మారుస్తారో చూడాలన్నారు. నగర అభివృద్ధి కీ కేంద్ర ప్రభుత్వం నిధులు పంపితే వాటి ఎంత వరకు సద్వినియోగం చేసారో ప్రజలకు తెలియా జేయాలన్నారు.

