Wednesday, 29 July 2026
  • Home  
  • క్రాఫ్ట్ విలేజ్ ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి :జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
- తిరుపతి

క్రాఫ్ట్ విలేజ్ ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి :జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

పున్నమి ప్రతినిధి,తిరుపతి, జూలై 29: * క్రాఫ్ట్ విలేజ్ ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్ లో క్రాఫ్ట్ విలేజ్ పై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం, డీఆర్‌డీఏ (DRDA) సమన్వయంతో మొత్తం 3 ఎంపోరియం బ్లాక్‌లు, 3 వర్క్ షెడ్లు మరియు మరుగుదొడ్డి సౌకర్యంతో కూడిన 1 శిక్షణ తరగతి గది నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిర్మాణ పనులను రోడ్లు మరియు భవనాల శాఖ (R&B Department) టెండర్ విధానంలో చేపట్టిందని తెలిపారు. మొత్తం 3 ఎంపోరియం బ్లాక్‌ లు, శిక్షణ తరగతి గది నిర్మాణం కూడా పూర్తయిందన్నారు. 3 వర్క్ షెడ్లలో 1 వర్క్ షెడ్ నిర్మాణం పూర్తికాగా, మిగిలిన 2 వర్క్ షెడ్ల నిర్మాణ పనులు పాక్షికంగా పూర్తయ్యాయన్నారు. పెండింగ్ లో ఉన్న పనులను సంబంధిత శాఖలు సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్ అండ్ బి, డిఆర్డిఏ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో తిరుపతి, చిత్తూరు డిఆర్డిఏ పిడి లు శోభన్ బాబు, శ్రీదేవి, ఏడి హ్యాండి క్రాఫ్ట్ సత్యమూర్తి, ఆర్ అండ్ బి ఈఈ రాజా నాయక్, తదితరులు పాల్గొన్నారు. *—డి ఐ పి ఆర్ ఓ, తిరుపతి—*

పున్నమి ప్రతినిధి,తిరుపతి, జూలై 29:

* క్రాఫ్ట్ విలేజ్ ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్ లో క్రాఫ్ట్ విలేజ్ పై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం, డీఆర్‌డీఏ (DRDA) సమన్వయంతో మొత్తం 3 ఎంపోరియం బ్లాక్‌లు, 3 వర్క్ షెడ్లు మరియు మరుగుదొడ్డి సౌకర్యంతో కూడిన 1 శిక్షణ తరగతి గది నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిర్మాణ పనులను రోడ్లు మరియు భవనాల శాఖ (R&B Department) టెండర్ విధానంలో చేపట్టిందని తెలిపారు. మొత్తం 3 ఎంపోరియం బ్లాక్‌ లు, శిక్షణ తరగతి గది నిర్మాణం కూడా పూర్తయిందన్నారు. 3 వర్క్ షెడ్లలో 1 వర్క్ షెడ్ నిర్మాణం పూర్తికాగా, మిగిలిన 2 వర్క్ షెడ్ల నిర్మాణ పనులు పాక్షికంగా పూర్తయ్యాయన్నారు. పెండింగ్ లో ఉన్న పనులను సంబంధిత శాఖలు సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్ అండ్ బి, డిఆర్డిఏ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో తిరుపతి, చిత్తూరు డిఆర్డిఏ పిడి లు శోభన్ బాబు, శ్రీదేవి, ఏడి హ్యాండి క్రాఫ్ట్ సత్యమూర్తి, ఆర్ అండ్ బి ఈఈ రాజా నాయక్, తదితరులు పాల్గొన్నారు.

*—డి ఐ పి ఆర్ ఓ, తిరుపతి—*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.