Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

తిరుమలలో ఆక్టోపస్ మాక్ డ్రిల్…. బ్రహ్మోత్సవాల భద్రతపై సమగ్ర సమీక్ష

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తిరుమలలో ఆక్టోపస్ మాక్ డ్రిల్…. బ్రహ్మోత్సవాల భద్రతపై సమగ్ర సమీక్ష

వార్త ముఖ్యాంశాలు

  • గాయత్రి నిలయం గెస్ట్ హౌస్, ప్రాంతాల్లో ఆక్టోపస్ మాక్ డ్రిల్ నిర్వహణ -బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వీఐపీలు, ప్రముఖుల భద్రతపై ప్రత్యేక దృష్టి.
  • -పోలీస్, టీటీడీ విజిలెన్స్, ఫైర్, మెడికల్, రెవెన్యూ సమన్వయంతో కసరత్తు.
  • తిరుమల ఆగస్టు 25 పున్నమి ప్రతినిధి తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.

గాయత్రి నిలయం గెస్ట్ హౌస్, ప్రాంతాల్లో ఆక్టోపస్ మాక్ డ్రిల్ నిర్వహణ
-బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వీఐపీలు, ప్రముఖుల భద్రతపై ప్రత్యేక దృష్టి.
-పోలీస్, టీటీడీ విజిలెన్స్, ఫైర్, మెడికల్, రెవెన్యూ సమన్వయంతో కసరత్తు.

తిరుమల ఆగస్టు 25 పున్నమి ప్రతినిధి

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ, ఐపీఎస్ సూచనల మేరకు సోమవారం తిరుమల లోని గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో ఆక్టోపస్ మాక్ డ్రిల్ నిర్వహించా రు.తిరుమల డీఎస్పీ విజయ శేఖర్, ఆక్టోపస్ డీఎస్పీ కే. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆక్టోపస్, పోలీస్, టీటీడీ విజిలెన్స్, ఫైర్, మెడికల్, రెవెన్యూ తదితర విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. వీఐపీలు, ప్రముఖుల రాకపోకలు అధికంగా ఉండే గాయత్రి నిలయం పరిసర ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులను సమీక్షించి, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, వాహనాలపై తనిఖీలు నిర్వహించారు.
రాబోయే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని వీఐపీలు, ప్రముఖుల కదలికల సమయంలో భద్రతా చర్యలు, సిబ్బంది అప్రమత్తత, అనుమానాస్పద కదలికలను గుర్తించడం, అత్యవసర పరిస్థి తుల్లో తక్షణ స్పందన వంటి అంశాల ను మాక్ డ్రిల్ ద్వారా పరిశీలించారు.అనుకోని సంఘటనలు లేదా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు పోలీస్, టీటీడీ విజిలెన్స్, ఫైర్, మెడికల్, రెవెన్యూ తదితర విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేయడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించ డం, సమాచారాన్ని తక్షణమే సంబంధిత విభాగాలకు చేరవేయడం, పరిస్థితిని వేగంగా అదుపులోకి తీసుకురావడం వంటి అంశాలపై సిబ్బందికి ప్రాయోగిక అవగాహన కల్పించారు.భక్తులు, వీఐపీలు, ప్రముఖుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, రాబోయే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేసేందుకు మాక్ డ్రిల్స్, ఆకస్మిక తనిఖీలు, భద్రతా సమీక్షలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారు లు, సిబ్బంది సమన్వయంతో పాల్గొని, ముందస్తు ప్రణాళిక, పరస్పర సమన్వయం, అప్రమత్తతతో విధులు నిర్వహించాల్సిన ఆవశ్యకతను మాక్ డ్రిల్ ద్వారా ప్రదర్శించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *