శ్రీకాళహస్తి, ఆగష్టు 25, పున్నమి ప్రతినిధి
శ్రీకాళహస్తి పట్టణంలోని ది స్కూల్ ఆవరణలో జనార్ధన్ పవార్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు, మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కీ.శే. శాంతారామ్ రావు జె. పవార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు హాజరై, శాంతారామ్ రావు జె. పవార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ
అందరివాడు శాంతారామ్ కులం, మతం, వర్గం, వర్ణంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా చేరదీసే వ్యక్తిత్వం శాంతారామ్ ది. రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయన అందరివాడుగా నిలిచారని, ఆయన భౌతికంగా మనకు దూరమవ్వడం తీరని లోటని పేర్కొన్నారు.
ఆశయాల సాధన శాంతారామ్ ఆశయాలకు అనుగుణంగానే జనార్ధన్ పవార్ ‘ది స్కూల్’ను విజయవంతంగా నడుపుతున్నారని, ప్రస్తుతం ఈ పాఠశాలలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగిందని కొనియాడారు. ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన పాఠశాల, చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలను ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమన్నారు.మచ్చలేని నాయకత్వం
శ్రీకాళహస్తి దేవస్థాన చైర్మన్‌గా, మున్సిపల్ చైర్మన్‌గా ఎక్కడా అవినీతి మరక పడకుండా పాలన సాగించిన ఘనత శాంతారామ్ దేనని కొనియాడారు. తమకు దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా అవకాశం వచ్చినప్పుడు ఆయన మార్గదర్శకత్వాన్ని స్మరించుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టినట్లు తెలిపారు.
శాంతారామ్ రావు పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, ఆయన కుటుంబ సభ్యులైన డాక్టర్ అర్చనకు, సోదరులకు జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రత్నం రెడ్డి, శ్రీవారి సురేష్, కంటా ఉదయ్ కుమార్, పటాన్ ఫరీద్, ఆర్కాడ్ శంకర్, గిరి గౌడ్, జూమ్లేష, బావాజీ, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


