పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుపై నిరసన.. రేపు నర్సంపేట బంద్
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు ఘటనకు నిరసనగా రేపు నర్సంపేట పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. విగ్రహం తొలగింపును ఖండిస్తూ రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాయి.విగ్రహం తొలగింపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, శాంతియుతంగా బంద్‌నువిజయవంతంచేయాలనిఅన్నారు.నిర్వాహకులు ప్రజలకు, వ్యాపార వర్గాలకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో నర్సంపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.



