Tuesday, 18 August 2026
  • Home  
  • రూ.2 కోట్లు మంజూరైనా పనులు ఎందుకు ప్రారంభం కాలేదు? బండి శోభనాచలం కళాశాలకు పూర్వ వైభవం తీసుకురావాలి: బీజేపీ
- ఖమ్మం

రూ.2 కోట్లు మంజూరైనా పనులు ఎందుకు ప్రారంభం కాలేదు? బండి శోభనాచలం కళాశాలకు పూర్వ వైభవం తీసుకురావాలి: బీజేపీ

సత్తుపల్లి/ ఖమ్మం శిథిలావస్థకు చేరిన సత్తుపల్లిలోని బండి శోభనాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పూర్వ వైభవం తీసుకురావాలని బీజేపీ సత్తుపల్లి టీం డిమాండ్ చేసింది. బాణోత్ విజయ్, మందా శివ యాదవ్ ఆధ్వర్యంలో కళాశాలను పరిశీలించిన బృందం విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుంది. కార్యక్రమంలో భాస్కర్ణి వీరంరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల భవన నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరైనా రెండేళ్లుగా పనులు ప్రారంభం కాకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణమే శాశ్వత భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు. కళాశాల పునర్నిర్మాణ అంశాన్ని బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, పునర్నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని భాస్కర్ణి వీరంరాజు తెలిపారు. కార్యక్రమంలో పాలకొల్లు శ్రీనివాస్, డాక్టర్ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.

సత్తుపల్లి/ ఖమ్మం

శిథిలావస్థకు చేరిన సత్తుపల్లిలోని బండి శోభనాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పూర్వ వైభవం తీసుకురావాలని బీజేపీ సత్తుపల్లి టీం డిమాండ్ చేసింది. బాణోత్ విజయ్, మందా శివ యాదవ్ ఆధ్వర్యంలో కళాశాలను పరిశీలించిన బృందం విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుంది. కార్యక్రమంలో భాస్కర్ణి వీరంరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల భవన నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరైనా రెండేళ్లుగా పనులు ప్రారంభం కాకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణమే శాశ్వత భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు. కళాశాల పునర్నిర్మాణ అంశాన్ని బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, పునర్నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని భాస్కర్ణి వీరంరాజు తెలిపారు. కార్యక్రమంలో పాలకొల్లు శ్రీనివాస్, డాక్టర్ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.