Thursday, 3 September 2026
  • Home  
  • పెద్దగోపతిలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాలు
- ఖమ్మం

పెద్దగోపతిలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాలు

వైరా / ఖమ్మం పెద్దగోపతి గ్రామంలోని కంఠమహేశ్వర స్వామి ఆలయం వద్ద బోనాల కార్యక్రమాన్ని గౌడ కులస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కంఠమహేశ్వర స్వామికి ప్రత్యేకంగా బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమం సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటీశ్వర రావు, పెద్ద గౌడు గుండ్ల గోపాల్ రావు, కంఠమహేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ ఇజ్జగాని శ్రీనివాస్, రుద్రగాని మాధవరావు, బొడ్డు రాంబాబు గౌడ్, గుండ్ల కృష్ణ, జోగేశ్వరరావు, బండి వెంకటేశ్వర్లు, సంపేట నరసింహారావు, సంపేట రాంబాబు, బొడ్డు శ్రీను, నారాయణ, బొడ్డు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే గౌడ సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

వైరా / ఖమ్మం

పెద్దగోపతి గ్రామంలోని కంఠమహేశ్వర స్వామి ఆలయం వద్ద బోనాల కార్యక్రమాన్ని గౌడ కులస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కంఠమహేశ్వర స్వామికి ప్రత్యేకంగా బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమం సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.

ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటీశ్వర రావు, పెద్ద గౌడు గుండ్ల గోపాల్ రావు, కంఠమహేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ ఇజ్జగాని శ్రీనివాస్, రుద్రగాని మాధవరావు, బొడ్డు రాంబాబు గౌడ్, గుండ్ల కృష్ణ, జోగేశ్వరరావు, బండి వెంకటేశ్వర్లు, సంపేట నరసింహారావు, సంపేట రాంబాబు, బొడ్డు శ్రీను, నారాయణ, బొడ్డు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే గౌడ సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.