Tuesday, 23 June 2026
  • Home  
  • పున్నమి న్యూస్‌కు స్పందన.. ఏటికొప్పాక గ్రామానికి ప్రాధాన్యం కల్పించిన ఇన్‌చార్జి కార్యదర్శి కె. గిరిప్రసాద్‌రావు..!
- అనకాపల్లి

పున్నమి న్యూస్‌కు స్పందన.. ఏటికొప్పాక గ్రామానికి ప్రాధాన్యం కల్పించిన ఇన్‌చార్జి కార్యదర్శి కె. గిరిప్రసాద్‌రావు..!

యలమంచిలి , జూన్ 23 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక గ్రామంలో పంచాయతీ కార్యదర్శి అందుబాటులో లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై “ప్రజల గోడు వినేదెవరు..?” అనే శీర్షికతో పున్నమి న్యూస్‌లో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఏటికొప్పాక గ్రామపంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శి కె. గిరిప్రసాద్‌రావు వివరణ విడుదల చేశారు. తాను లైనకొత్తూరు గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూనే, సిబ్బంది ప్రమోషన్లు మరియు బదిలీల కారణంగా రుక్మిణిపురం, ఏటికొప్పాక గ్రామపంచాయతీలకు తాత్కాలిక ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇటీవల డిప్యూటీ ఎంపీడీఓ ఇన్‌చార్జి బాధ్యతలు కూడా అప్పగించడంతో మండల కేంద్రంలో పరిపాలనా పనులు, ఫీల్డ్ ఎంక్వైరీలు తదితర కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ కారణాల వల్ల ప్రతిరోజూ ఏటికొప్పాక పంచాయతీని సందర్శించడం సాధ్యం కాలేదని అంగీకరించిన ఆయన, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇకపై ప్రతి వారంలో మంగళవారం మరియు గురువారం రోజుల్లో ఏటికొప్పాక గ్రామపంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. పున్నమి న్యూస్‌లో ప్రచురితమైన కథనం నేపథ్యంలో అధికారులు స్పందించి ప్రజలకు స్పష్టత ఇవ్వడం పట్ల గ్రామస్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు మరింత అందుబాటులో ఉంటే గ్రామాభివృద్ధికి దోహదపడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

యలమంచిలి , జూన్ 23 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఏటికొప్పాక గ్రామంలో పంచాయతీ కార్యదర్శి అందుబాటులో లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై “ప్రజల గోడు వినేదెవరు..?” అనే శీర్షికతో పున్నమి న్యూస్‌లో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఏటికొప్పాక గ్రామపంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శి కె. గిరిప్రసాద్‌రావు వివరణ విడుదల చేశారు.
తాను లైనకొత్తూరు గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూనే, సిబ్బంది ప్రమోషన్లు మరియు బదిలీల కారణంగా రుక్మిణిపురం, ఏటికొప్పాక గ్రామపంచాయతీలకు తాత్కాలిక ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇటీవల డిప్యూటీ ఎంపీడీఓ ఇన్‌చార్జి బాధ్యతలు కూడా అప్పగించడంతో మండల కేంద్రంలో పరిపాలనా పనులు, ఫీల్డ్ ఎంక్వైరీలు తదితర కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని పేర్కొన్నారు.
ఈ కారణాల వల్ల ప్రతిరోజూ ఏటికొప్పాక పంచాయతీని సందర్శించడం సాధ్యం కాలేదని అంగీకరించిన ఆయన, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇకపై ప్రతి వారంలో మంగళవారం మరియు గురువారం రోజుల్లో ఏటికొప్పాక గ్రామపంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.
పున్నమి న్యూస్‌లో ప్రచురితమైన కథనం నేపథ్యంలో అధికారులు స్పందించి ప్రజలకు స్పష్టత ఇవ్వడం పట్ల గ్రామస్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు మరింత అందుబాటులో ఉంటే గ్రామాభివృద్ధికి దోహదపడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.