Sunday, 19 July 2026
  • Home  
  • నేరెళ్ల బాధితుడి మృతితో మరో కుటుంబం అనాథ… ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి!”
- రాజన్న సిరిసిల్ల

నేరెళ్ల బాధితుడి మృతితో మరో కుటుంబం అనాథ… ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి!”

రాజన్న సిరిసిల్ల జూలై 18 పున్నమి ప్రతినిధి నేరెళ్ల బాధితుడి మృతితో మరో కుటుంబం అనాథ… ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి నేరెళ్ల థర్డ్ డిగ్రీ బాధితుల్లో ఒకరైన గంధం గోపాల్ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని టీఆర్ఎస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి మజీద్ అన్నారు. పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి బియ్యం, ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మజీద్ మాట్లాడుతూ, న్యాయం కోసం పోరాడిన కుటుంబం నేడు కన్నీటిలో మునిగిపోయిందని, భార్య భర్తను కోల్పోగా, పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకొని బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కదిరే భాస్కర్ గౌడ్, సయ్యద్ జావిద్, మార్వాడి దేవరాజు, ఓర్సు అశోక్, మండపల్లి రవి, సిద్ధూ పాల్గొన్నారు. ఒక మనిషి మాత్రమే కాదు… ఒక కుటుంబానికి ఆధారం కోల్పోయింది. భార్య కన్నీళ్లు, పిల్లల భవిష్యత్తు ప్రభుత్వం మనసును కదిలించి, వెంటనే ఆ కుటుంబానికి అండగా నిలవాలని ప్రజలు కోరుతున్నారు.

రాజన్న సిరిసిల్ల జూలై 18 పున్నమి ప్రతినిధి

నేరెళ్ల బాధితుడి మృతితో మరో కుటుంబం అనాథ… ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి
నేరెళ్ల థర్డ్ డిగ్రీ బాధితుల్లో ఒకరైన గంధం గోపాల్ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని టీఆర్ఎస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి మజీద్ అన్నారు. పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి బియ్యం, ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా మజీద్ మాట్లాడుతూ, న్యాయం కోసం పోరాడిన కుటుంబం నేడు కన్నీటిలో మునిగిపోయిందని, భార్య భర్తను కోల్పోగా, పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకొని బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కదిరే భాస్కర్ గౌడ్, సయ్యద్ జావిద్, మార్వాడి దేవరాజు, ఓర్సు అశోక్, మండపల్లి రవి, సిద్ధూ పాల్గొన్నారు.
ఒక మనిషి మాత్రమే కాదు… ఒక కుటుంబానికి ఆధారం కోల్పోయింది. భార్య కన్నీళ్లు, పిల్లల భవిష్యత్తు ప్రభుత్వం మనసును కదిలించి, వెంటనే ఆ కుటుంబానికి అండగా నిలవాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.