మహానంది :శ్రావణమాసపు మూడవ శుక్రవారం, శ్రావణ పౌర్ణమిల సందర్భంగా మహానంది శ్రీ కామేశ్వరీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అలంకరణలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి (EO) ఎన్. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారిని మయూర పింఛాలతో వైభవంగా అలంకరించనున్నారు.
ఈ ప్రత్యేక అలంకరణ కోసం తమిళనాడు నుంచి ప్రత్యేకంగా నెమలి పింఛాలను తెప్పించారు. నిపుణులైన కళాకారులు, ఆలయ సిబ్బంది నెమలి పింఛాలతో అమ్మవారిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. శ్రావణ పౌర్ణమి, మూడో శుక్రవారం ఒకే రోజు రావడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని భావించి, దర్శనానికి వచ్చేవారి కోసం అధికారులు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నారు.

నెమలి పింఛాలతో కామేశ్వరీ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ
మహానంది :శ్రావణమాసపు మూడవ శుక్రవారం, శ్రావణ పౌర్ణమిల సందర్భంగా మహానంది శ్రీ కామేశ్వరీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అలంకరణలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి (EO) ఎన్. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారిని మయూర పింఛాలతో వైభవంగా అలంకరించనున్నారు. ఈ ప్రత్యేక అలంకరణ కోసం తమిళనాడు నుంచి ప్రత్యేకంగా నెమలి పింఛాలను తెప్పించారు. నిపుణులైన కళాకారులు, ఆలయ సిబ్బంది నెమలి పింఛాలతో అమ్మవారిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. శ్రావణ పౌర్ణమి, మూడో శుక్రవారం ఒకే రోజు రావడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని భావించి, దర్శనానికి వచ్చేవారి కోసం అధికారులు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నారు.

