⛔నాయుడుపేటలో జరిగిన డీఎస్సీ రిలే నిరాహార దీక్షలు పై స్పందించిన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం
పున్నమి న్యూస్ రిపోర్టర్ మద్దాలి వెంకయ్య దొరవారిసత్రం 07-08-26
📌తిరుపతి జిల్లా నాయుడుపేటలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం సమీపంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలపై మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం తీవ్రస్థాయిలో స్పందించారు.
📌డీఎస్సీ నియామకాల అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని ఆయన సూచించారు.
📌ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్‌కు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు.
📌విద్యారంగంలో పలు సంస్కరణలు చేపట్టడంతో పాటు, రాష్ట్రానికి పెట్టుబడులు మరియు కంపెనీలను తీసుకురావడంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.
📌అలాగే ‘తల్లికి వందనం’ వంటి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
📌డీఎస్సీ అంశంపై వైఎస్సార్సీపీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని విమర్శించారు.
📌మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీక్షల పేరుతో ఇబ్బందులు పడకుండా ఆందోళనలను విరమించుకోవాలని సూచించారు.
📌ఇప్పటికైనా నిరాహార దీక్షలను విరమించి ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా పనిచేయాలని తెలియజేశారు.


