Friday, 7 August 2026
  • Home  
  • అక్రమార్కుల దాసోహం – అక్రిడేషన్ కార్డు రద్దు చేయాలి* కలం అమ్ముకున్న వారికి కార్డు ఎందుకు?”*
- ఖమ్మం

అక్రమార్కుల దాసోహం – అక్రిడేషన్ కార్డు రద్దు చేయాలి* కలం అమ్ముకున్న వారికి కార్డు ఎందుకు?”*

*అక్రమార్కుల దాసోహం – అక్రిడేషన్ కార్డు రద్దు చేయాలి* *ఖమ్మం విలేఖరుల ఫైర్* *”కలం అమ్ముకున్న వారికి కార్డు ఎందుకు?”* *ప్రభుత్వ లాభాలు తీసుకుంటూనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయడం* *కలం అమ్ముడుపోకూడదు* *మనస్సాక్షి వంగకూడదు..!* *జర్నలిజం ఉద్యోగం కాదు,* *ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత.* *నిష్పాక్షికత, నిజాయితీ, ప్రజా* *ప్రయోజనమే విలేకరి అసలు గుర్తింపు.* *విలేకరి కలం సత్యం వైపే నడవాలి..!* *ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచి, అధికారాన్ని* *ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యలను వెలుగులోకి* *తెచ్చే పాత్రికేయుడే నిజమైన జర్నలిస్టు*. *జర్నలిజం ఒక వృత్తి కాదు.* *ప్రజల పట్ల ఒక ధర్మం….!* గ్రామ సమస్యల నుంచి జాతీయ అంశాల వరకు ప్రజల గొంతుకగా నిలిచి, నిజాన్ని నిర్భయంగా చెప్పే కలమే ప్రజాస్వామ్యానికి బలం. ఒక్క విలేకరి… లక్ష మంది స్వరం…! నిజం కోసం రాసే ప్రతి వార్త సమాజాన్ని మేల్కొలుపుతుంది. నిష్పాక్షికతను నిలబెట్టే పాత్రికేయుడే చరిత్రలో నిలిచిపోతాడు. నిజమే విలేకరి ఆయుధం.ప్రజలే అతని బలం..! రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రయోజనాల కోసం కలం పట్టినప్పుడే జర్నలిజానికి గౌరవం, విలేకరికి శాశ్వత గుర్తింపు లభిస్తుంది. జర్నలిజం వృత్తి కాదు. ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు. పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం: ప్రజా సమస్యలపై పోరాడాల్సిన కలం, ఇప్పుడు అక్రమార్కుల ముందు మోకరిల్లింది. అక్రిడేషన్ కార్డు అనే అస్త్రాన్ని అడ్డుపెట్టుకుని కొందరు విలేఖరులు సిండికేట్ దందా అక్రమ మద్యం తరలింపు ఇసుక, భూ, మాఫియాతో చేతులు కలుపుతున్నారని విలేఖరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. *రహస్య ఒప్పందాలు – రాత్రికి రాత్రే సెటిల్మెంట్లు* అక్రమాలు చేసే వారి దగ్గర నుండి ముడుపులు తీసుకుని, ఆ వార్తలను అణిచివేస్తున్నారని ఆరోపించారు. “ఒకవైపు ప్రభుత్వం నుండి హెల్త్ కార్డు, బస్సు రాయితీలు తీసుకుంటారు. మరోవైపు అదే ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే వారికి దాసోహం అంటారు. ఇది ఏ రకమైన విలేఖరితనం?” అని ప్రశ్నించారు. ప్రజల గోడును వెలుగులోకి తేవాల్సిన వారే, ఇప్పుడు అక్రమాలకు వత్తాసు పలుకుతున్నారని, దీనివల్ల నిజాయితీగా పని చేసే విలేఖరుల పరువు పోతోందని వాపోయారు. వెంటనే జిల్లా I&PR అధికారి DPRO రంగంలోకి దిగి, అక్రమార్కులతో కుమ్మక్కైన అక్రిడేషన్ కార్డు విలేఖరుల జాబితా తయారు చేసి వారి కార్డులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. “విలేఖరి అనే హోదాను అక్రమార్కులకు కట్టబెట్టడం సమాజానికి చేస్తున్న ద్రోహం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి, ప్రజా సమస్యలపై గళం విప్పే నిజమైన విలేఖరులకు మాత్రమే గుర్తింపు ఇవ్వాలి” అని ఏన్కూరు మండల విలేఖరులు హెచ్చరించారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టరేట్ కు ఫిర్యాదు చేస్తాము

*అక్రమార్కుల దాసోహం – అక్రిడేషన్ కార్డు రద్దు చేయాలి*

*ఖమ్మం విలేఖరుల ఫైర్*
*”కలం అమ్ముకున్న వారికి కార్డు ఎందుకు?”*

*ప్రభుత్వ లాభాలు తీసుకుంటూనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయడం*

*కలం అమ్ముడుపోకూడదు*
*మనస్సాక్షి వంగకూడదు..!*

*జర్నలిజం ఉద్యోగం కాదు,*
*ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత.*

*నిష్పాక్షికత, నిజాయితీ, ప్రజా*
*ప్రయోజనమే విలేకరి అసలు గుర్తింపు.*

*విలేకరి కలం సత్యం వైపే నడవాలి..!*

*ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచి, అధికారాన్ని* *ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యలను వెలుగులోకి* *తెచ్చే పాత్రికేయుడే నిజమైన జర్నలిస్టు*.

*జర్నలిజం ఒక వృత్తి కాదు.*
*ప్రజల పట్ల ఒక ధర్మం….!*

గ్రామ సమస్యల నుంచి జాతీయ అంశాల వరకు ప్రజల గొంతుకగా నిలిచి, నిజాన్ని నిర్భయంగా చెప్పే కలమే ప్రజాస్వామ్యానికి బలం.

ఒక్క విలేకరి… లక్ష మంది స్వరం…!

నిజం కోసం రాసే ప్రతి వార్త సమాజాన్ని మేల్కొలుపుతుంది. నిష్పాక్షికతను నిలబెట్టే పాత్రికేయుడే చరిత్రలో నిలిచిపోతాడు.

నిజమే విలేకరి ఆయుధం.ప్రజలే అతని బలం..!

రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రయోజనాల కోసం కలం పట్టినప్పుడే జర్నలిజానికి గౌరవం, విలేకరికి శాశ్వత గుర్తింపు లభిస్తుంది.

జర్నలిజం వృత్తి కాదు.
ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు.

పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

ఖమ్మం:
ప్రజా సమస్యలపై పోరాడాల్సిన కలం, ఇప్పుడు అక్రమార్కుల ముందు మోకరిల్లింది. అక్రిడేషన్ కార్డు అనే అస్త్రాన్ని అడ్డుపెట్టుకుని కొందరు విలేఖరులు సిండికేట్ దందా అక్రమ మద్యం తరలింపు ఇసుక, భూ, మాఫియాతో చేతులు కలుపుతున్నారని విలేఖరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

*రహస్య ఒప్పందాలు – రాత్రికి రాత్రే సెటిల్మెంట్లు*

అక్రమాలు చేసే వారి దగ్గర నుండి ముడుపులు తీసుకుని, ఆ వార్తలను అణిచివేస్తున్నారని ఆరోపించారు. “ఒకవైపు ప్రభుత్వం నుండి హెల్త్ కార్డు, బస్సు రాయితీలు తీసుకుంటారు. మరోవైపు అదే ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే వారికి దాసోహం అంటారు. ఇది ఏ రకమైన విలేఖరితనం?” అని ప్రశ్నించారు.

ప్రజల గోడును వెలుగులోకి తేవాల్సిన వారే, ఇప్పుడు అక్రమాలకు వత్తాసు పలుకుతున్నారని, దీనివల్ల నిజాయితీగా పని చేసే విలేఖరుల పరువు పోతోందని వాపోయారు.

వెంటనే జిల్లా I&PR అధికారి DPRO రంగంలోకి దిగి, అక్రమార్కులతో కుమ్మక్కైన అక్రిడేషన్ కార్డు విలేఖరుల జాబితా తయారు చేసి వారి కార్డులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

“విలేఖరి అనే హోదాను అక్రమార్కులకు కట్టబెట్టడం సమాజానికి చేస్తున్న ద్రోహం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి, ప్రజా సమస్యలపై గళం విప్పే నిజమైన విలేఖరులకు మాత్రమే గుర్తింపు ఇవ్వాలి” అని ఏన్కూరు మండల విలేఖరులు హెచ్చరించారు.
లేనిపక్షంలో జిల్లా కలెక్టరేట్ కు ఫిర్యాదు చేస్తాము

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.