తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్ దివాకర్ టి ఎస్ కీ
వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీరామనేని మణి, అల్లిక అంజయ్య, వీరవెల్లి రాజేష్, మృత్యుంజయరావు తదితరులు పాల్గొన్నారు.



