Tuesday, 15 September 2026
  • Home  
  • చిట్వేలు మండలంలో ఎస్ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్
- అన్నమయ్య

చిట్వేలు మండలంలో ఎస్ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్

చిట్వేలు: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి చిట్వేలు మండలంలోని అన్ని పాఠశాలల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారులు కాజా మొహిద్దీన్, విద్యాశాఖ అధికారి-2 ఈశ్వరయ్య తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్ 15న నోటిఫికేషన్, సెప్టెంబర్ 18న ఓటర్ల జాబితా తయారీ, సెప్టెంబర్ 25న తుది ఓటర్ల జాబితా ప్రకటించడం, సెప్టెంబర్ 29న ఉదయం ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.సంబంధిత పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఓటర్లుగా పాల్గొని తమకు నచ్చిన వారిని ఎస్ఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు సభ్యులుగా ఎన్నుకోవాలని అధికారులు సూచించారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే మండలంలోని ప్రైవేట్ పాఠశాలల్లో కూడా స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని అధికారులు తెలిపారు.

చిట్వేలు: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి చిట్వేలు మండలంలోని అన్ని పాఠశాలల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారులు కాజా మొహిద్దీన్, విద్యాశాఖ అధికారి-2 ఈశ్వరయ్య తెలిపారు.
ఎన్నికల ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్ 15న నోటిఫికేషన్, సెప్టెంబర్ 18న ఓటర్ల జాబితా తయారీ, సెప్టెంబర్ 25న తుది ఓటర్ల జాబితా ప్రకటించడం, సెప్టెంబర్ 29న ఉదయం ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.సంబంధిత పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఓటర్లుగా పాల్గొని తమకు నచ్చిన వారిని ఎస్ఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు సభ్యులుగా ఎన్నుకోవాలని అధికారులు సూచించారు.
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే మండలంలోని ప్రైవేట్ పాఠశాలల్లో కూడా స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.