చిట్వేల్ మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నెల 18న ఓటర్ల జాబితా రూపకల్పన చేసి, 25న తుది జాబితాను ప్రకటించనున్నారు. సెప్టెంబర్ 29న విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యంతో ఎస్ఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించాలని ఎంఈఓ ఖాజా మొహిద్దీన్, విద్యాశాఖ అధికారి ఈశ్వరయ్య ఉపాధ్యాయులను ఆదేశించారు.

చిట్వేల్లో ఎస్ఎంసీ ఎన్నికలకు సర్వం సిద్ధం